తిలక్ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ వ్యాఖ్యల దుమారం.. సహచర ఆటగాడిని అలా పిలుస్తావా? అంటూ నెటిజన్ల ఫైర్!

  • తిలక్ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు
  • 'ఓయ్ అంధేరే' అంటూ పిలవడంతో రేగిన దుమారం
  • సోషల్ మీడియాలో అర్ష్‌దీప్‌పై వెల్లువెత్తిన విమర్శలు
  • వారిద్దరూ మంచి స్నేహితులైనా తగ్గని ఫ్యాన్స్ ఆగ్రహం
  • ఇది జాతి వివక్షే అంటూ నెటిజన్ల ఫైర్
టీమిండియా యువ పేసర్, పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌) ఆటగాడు అర్ష్‌దీప్ సింగ్ తాజా వివాదంలో చిక్కుకున్నాడు. ముంబై ఇండియన్స్ (ఎంఐ) ఆటగాడు తిలక్ వర్మను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అర్ష్‌దీప్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అస‌లేం జ‌రిగిందంటే..! 
నిన్న‌ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌కు ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. వైరల్ అవుతున్న వీడియోలో అర్ష్‌దీప్ సింగ్.. తిలక్ వర్మను "ఓయ్, అంధేరే" (హేయ్, నల్లవాడా/చీకటి అనే అర్థం వచ్చేలా) అని పిలవడం స్పష్టంగా వినిపించింది. ఈ పదం జాతి వివక్షను సూచిస్తుందని, ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని పలువురు నెటిజన్లు అర్ష్‌దీప్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవానికి అర్ష్‌దీప్, తిలక్ వర్మ మధ్య మంచి స్నేహబంధం ఉంది. క్రికెట్ ఆటకు మించి వారిద్దరూ చాలా సన్నిహితంగా ఉంటారు. అయితే, స్నేహితుల మధ్య సరదాకే అయినా ఇలాంటి పదజాలం వాడటంపై అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తరచూ వ్లాగ్స్, రీల్స్‌తో సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే అర్ష్‌దీప్‌ను నెటిజన్లు వదలడం లేదు. స్నేహితుల మధ్య సరదా సంభాషణే అయినప్పటికీ, ఆ వ్యాఖ్యలకు జాతి వివక్ష రంగు పులుముకోవడంతో అర్ష్‌దీప్ సింగ్ విమర్శల పాలయ్యాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Viral Video
Arshdeep Singh
Tilak Varma
IPL 2024
Punjab Kings
Mumbai Indians
racism
cricket controversy
Arshdeep Singh comment
social media
netizens fire

More Telugu News